గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 153 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బ్యాటర్లలో మాథ్యూ షార్ట్ (36: 24 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ తరఫున శుభ్‌మన్ గిల్ (67: 49 బంతుల్లో) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (30: 19 బంతుల్లో) వేగంగా ఆడారు. వీరు మొదటి వికెట్‌కు 4.4 ఓవర్లలోనే 48 పరుగులు జోడించారు. తర్వాత మిగతా బ్యాటర్లు వేగంగా ఆడటంలో విఫలం అయ్యారు. ఛేదించాల్సిన లక్ష్యం తక్కువే కావడంతో గుజరాత్‌కు ఇబ్బందులు ఎదురు కాలేదు.