చెపాక్‌లో సంజూ సేన అద్భుతం చేసింది. సీఎస్‌కే ఫ్యాన్స్‌ను టెన్షన్ పెట్టించింది. ధోనీ సేన చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ను ఆఖరి బంతికి లాగేసుకుంది. 3 తేడాతో విక్టరీ అందుకుంది. 176 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. ఛేదనకు దిగిన సీఎస్‌కేను 172/6కు పరిమితం చేసింది. డేవాన్ కాన్వే (50; 38 బంతుల్లో 6x4), ఎంఎస్ ధోనీ (32*; 17 బంతుల్లో 1x4, 3x6), రవీంద్ర జడేజా (25*; 15 బంతుల్లో 1x4, 2x6) మెరుపు షాట్లు బాదేశారు. అంతకు ముందు రాజస్థాన్ రాయల్స్‌లో ఓపెనర్ జోస్ బట్లర్ (52; 36 బంతుల్లో 1x4, 3x6) హాఫ్ సెంచరీ కొట్టాడు. దేవదత్ పడిక్కల్ (38; 26 బంతుల్లో 5x4), రవిచంద్రన్ అశ్విన్ (30; 22 బంతుల్లో 1x4, 2x6) రాణించారు. ఆఖర్లో షిమ్రన్ హెట్‌మైయిర్ (30*; 10 బంతుల్లో 1x4, 2x6) మెరుపు బ్యాటింగ్ చేశాడు. రాజస్థాన్ లో యాష్, యూజీ చెరో 2 వికెట్లు తీశారు. జైశ్వాల్ 2 క్యాచులు అందుకున్నాడు. 12 బంతుల్లో 40 రన్స్ అవసరమైనప్పుడు 19వ ఓవర్లో జడేజారెండు సిక్సులు, ఒక బౌండరీ బాది 19 రన్స్ అందించాడు. ఆఖరి ఓవర్లో 21 రన్స్ అవసరం కాగా మహీ రెండు సిక్సర్లు కొట్టాడు. ఆఖరి బంతికి 5 రన్స్‌కు సింగిల్ మాత్రమే తీశాడు.