ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మొదటి గెలుపు లభించింది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ 17.1 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాహుల్ త్రిపాఠి (74 నాటౌట్: 48 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్ (99 నాటౌట్: 66 బంతుల్లో) ఒంటరి పోరాటం చేశాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఇది తొలి విజయం. పంజాబ్ కింగ్స్‌కు కూడా ఇదే తొలి ఓటమి. ఓటమి పాలైనా శిఖర్ ధావన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో రైజర్స్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది.