ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (100 నాటౌట్: 55 బంతుల్లో) అద్భుత శతకంతో అజేయంగా నిలిచాడు. ఎయిడెన్ మార్క్రమ్ (50: 26 బంతుల్లో) మెరుపు వేగంతో అర్థ సెంచరీ సాధించాడు. కోల్‌కతా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులకు పరిమితం అయింది. కెప్టెన్ నితీష్ రానా (75: 41 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రింకూ సింగ్ (58 నాటౌట్: 31 బంతుల్లో) అజేయ అర్థ శతకం సాధించాడు. శతకం సాధించిన హ్యారీ బ్రూక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రీ రసెల్ మూడు వికెట్లు తీసుకున్నాడు. హైదరాబాద్ బౌలర్లలో మార్కండే, మార్కో జాన్సెన్‌లకు తలో రెండు వికెట్లు దక్కాయి.