ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అధర్వ తైదే (0: 3 బంతుల్లో), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (4: 4 బంతుల్లో) విఫలం అయ్యారు. దీంతో పంజాబ్ 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. సికందర్ రాజా (57: 41 బంతుల్లో) పంజాబ్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే తనకు మిగతా బ్యాటర్ల నుంచి ఆశించిన సహకారం లభించలేదు. కుదిరినంత సేపు పోరాడిన సికందర్ రాజా 18వ ఓవర్లో అవుటయ్యాడు. సికందర్ అవుటయ్యాక షారుక్ ఖాన్ (23 నాటౌట్: 10 బంతుల్లో) వేగంగా ఆడి పంజాబ్‌ను గెలిపించాడు.