ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మూడో విజయం లభించింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 24 పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్ ఫాఫ్ డుఫ్లెసిస్ (84: 56 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ (59: 47 బంతుల్లో) అర్థ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంతవరకు కెప్టెన్‌గా ఉన్న డుఫ్లెసిస్‌కు గాయం అయింది. దీంతో అతను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ మాత్రమే చేశాడు. 2021 సీజన్ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేయడం ఇదే ప్రథమం. అయినా ఆర్సీబీకి విజయాన్ని అందించాడు.