గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఈ సీజన్‌లోనే అతి పెద్ద చోక్ చేసింది. లక్నో విజయానికి చివరి 36 బంతుల్లో 31 పరుగులు కావాలి. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి. క్రీజులు సెట్ అయిన బ్యాటర్లు కేఎల్ రాహుల్ (68), కృనాల్ పాండ్యా (23) ఉన్నారు. కానీ చివరికి ఏడు పరుగులతో లక్నో ఓడిపోయింది. చివరి 36 బంతుల్లో కేవలం 24 పరుగులు మాత్రమే చేసి ఆరు వికెట్లను కోల్పోయింది. వీటిలో నాలుగు వికెట్లు చివరి ఓవర్‌లో పడ్డాయి. గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 135 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (66: 50 బంతుల్లో) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం లక్నో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేసింది.