ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్తాన్ రాయల్స్ 32 పరుగులతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అనంతరం చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దీంతో రాజస్తాన్ రాయల్స్‌కు విజయం దక్కింది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఇది రెండో ఓటమి. రాజస్తాన్ బ్యాట్స్‌మెన్‌లో యశస్వి జైస్వాల్ (77: 43 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే రెండు వికెట్లు తీసుకున్నాడు. చెన్నై బ్యాటర్లలో శివం దూబే (52: 33 బంతుల్లో) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్తాన్ బౌలర్లలో ఆడం జంపా మూడు వికెట్లు పడగొట్టాడు. యశస్వి జైస్వాల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.