సన్నీలియోన్ మంచి నటే కాదు, చక్కటి తల్లి కూడా...



సన్నీ లియోన్ అనగానే అందరికీ అడల్ట్ చిత్రాల్లో కనిపించే నటే గుర్తుకువస్తుంది. కానీ ఆమె మంచి తల్లి కూడా.



నిషా అనే పాపను దత్తత తీసుకున్న సన్నీకి, సరోగసీ పద్ధతిలో ఇద్దరు కవల బాబులు పుట్టారు.



ముగ్గురి పిల్లలకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది సన్నీ. వారికి ఇద్దరు కేర్ టేకర్లను కూడా ఏర్పాటుచేసింది.



సమయం చిక్కినప్పుడల్లా పిల్లలకు ఏదో ఒక మంచి పని నేర్పేందుకు, వారితో సమయం గడిపేందుకు ప్రయత్నిస్తుంది.



ముగ్గురు పిల్లలు నిషా, నోవా, అషేర్‌లకు తల్లంటే ప్రాణం. షూటింగ్ లకు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే పిల్లలను కూడా తనతో పాటే తీసుకెళుతుంది.



2017లో నిషాను దత్తత తీసుకోగా, 2018లో ఇద్దరు కవలలు పుట్టారు. ముగ్గురు పిల్లలను సమానం చూస్తుంది సన్నీ.



లాస్ ఏంజలస్ తో విశాలమైన ఇంటిని కొనుగోలు చేసిన సన్నీ, పిల్లల కోసం పెద్ద ఆటస్థలాన్ని, గార్డెన్ ను కూడా ఏర్పాటు చేసింది.



ఒకప్పుడు పోర్న్ స్టార్ అయినా, ఇప్పుడు ఆ జీవితాన్ని వదిలి చక్కటి నటిగా, మంచి తల్లిగా ఒదిగిపోయింది సన్నీ.