బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఆమె మోడర్న్ డ్రస్సులో మెరిసిపోతూ కనిపించారు. 2012లో ‘జిస్మ్ 2’ సినిమాతో సన్నీ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. 2014లో తెలుగులో కూడా ఆమె సినిమా చేశారు. అదే మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంట్ తీగ’. ఆ తర్వాత తను మెయిన్ రోల్‌లో ఒకే ఒక తెలుగు సినిమా చేశారు. మంచు విష్ణు ‘జిన్నా’లో సన్నీ నెగిటివ్ రోల్‌లో కనిపించారు. అంతకు ముందు ‘పీఎస్వీ గరుడవేగ’లో డియో డియో స్పెషల్ సాంగ్‌లో కనిపించారు.