యాంకర్ సుమ మైక్ పట్టుకుందంటే.. పంచ్‌ల ప్రవాహమే. తన నాన్ స్టాప్ పంచ్ లు, మాటలతో వినోదాన్ని పండిస్తూనే ఉంటుంది. ఆడియో ఈవెంట్లలోనే కాదు.. టీవీ షోలు, షూటింగ్ లొకేషన్స్‌లోనూ సుమ కనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే సుమ.. తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. వరలక్ష్మీ వ్రతం రోజు మహిళలు ఎంత బిజీగా ఉంటారో ఈ వీడియోలో చూపించింది. వంటలు, పూజలు.. అంటూ తెగ హడావిడి ఉంటుందని సుమ ఈ వీడియో ద్వారా చెప్పింది. ప్రస్తుతం 'సుమ అడ్డా' అనే షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న సుమ. సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారానూ సుమ తన అభిమానులకు అప్‌డేట్స్ ఇస్తోంది. Image Credits: Suma Kanakala/Instagram