సుమ కనకాల వస్త్రధారణ ఎప్పుడూ పద్ధతిగా ఉంటుంది. చీర కట్టినా, చుడిదార్ వేసినా... డ్రస్‌కు అందం వస్తుంది. సుమ కనకాల ఎక్కువగా చీరల్లో కనిపిస్తూ ఉంటారు. లేటెస్టుగా ఈ పర్పుల్ కలర్ శారీలో ఫోటోలు పోస్ట్ చేశారు. శారీలో సుమ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఆ టైప్ శారీ కోసం సెర్చ్ చేస్తున్నారు. తెలుగులో టాప్ యాంకర్ ఎవరు? అంటే సుమ కనకాల పేరు చెప్పాలి. 'క్యాష్' షో హోస్ట్ చేస్తున్న సుమ కనకాల... ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కూడా హోస్ట్ చేస్తున్నారు. రీసెంట్‌గా 'బ్రహ్మాస్త్ర' టీమ్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ ప్రెస్‌మీట్‌కు సుమ కనకాల యాంకరింగ్ చేశారు. సుమ కనకాల 'క్యాష్' షోలో 'బ్రహ్మాస్త్ర' హీరో హీరోయిన్లు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, రాజమౌళి, మౌనీ రాయ్ సందడి చేశారు. ఓనమ్ సందర్భంగా సుమ కనకాల ఇంట్లో సంబరాలు...