కేరళ పండుగ ఓనమ్ ను తెలుగు యాంకర్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ట్రెడిషనల్ లుక్ లో కనిపించి, అందర్నీ అలరించారు. ఈ ఫెస్ట్ లో సుమ, రష్మీ గౌతమ్, గీతా భగత్, శిల్ప చక్రవర్తి, అనసూయ, అనితా చౌదరి, ప్రవీణ, రవి పాల్గొన్నారు. యాంకర్స్ అంతా సంప్రదాయ చీర కట్టులో కనిపించారు. యాంకర్ రవి పంచె కట్టులో కనిపించాడు. సుమ, అనసూయ చాలా జోవియల్ గా, ఆనందంగా నవ్వుతూ మైమరపించారు. మరో పక్క సుమ తన భర్త రాజీవ్ కనకాల ఆశీస్సులు తీసుకుంటూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది. Image Credits: Anchor Ravi/Instagram