టాలీవుడ్ హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి మరో సారి వార్తల్లో నిలిచింది.

ఇటీవలే హీరో వరుణ్ తేజ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నా ఈ భామపై ఓ ప్రచారం జరుగుతోంది.

ఆమెకు ట్రిపోఫోబియా అనే అరుదైన వ్యాధి ఉందని, దీని వల్ల కొన్ని వస్తువులను చూస్తే తెలియకుండానే భయం వేస్తుందట.

ఈ సమస్య నుంచి బయటపడేందుకు లావణ్య చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తోందట.

ఈ ప్రచారంపై లావణ్య త్రిపాఠి స్పందించక తప్పలేదు.



నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా. ఇలాంటి తప్పుడు సమాచారం వల్ల మీకొచ్చే లాభం ఏంటి? అని మండిపడింది.

లావణ్య రిప్లైతో ఆమెకు ఎలాంటి వ్యాధి లేదని క్లారిటీ వచ్చింది.

ఇక మరి కొద్ది రోజుల్లో మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టనున్న ఈ బ్యూటీ.. వరుణ్ తో విదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది.

ఈ ఏడాది చివర్లో వరుణ్ తో లావణ్య వివాహం జరగనుందని సమాచారం.

Image Credits : Lavanya Tripathi/Instagram