డైరెక్టర్ సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ది కేరళ స్టోరీ'లో నటించి, హిట్ కొట్టిన అదా శర్మ. రూ.40 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.350 కోట్ల వరకు వసూలు చేసింది. కేరళలోని కొంతమంది యువతులను ఇస్లాం మతంలోకి మార్చి సౌదీకి తరలించే నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఎన్ని ట్రోల్స్, కామెంట్స్ వచ్చినా స్టోరీ బావుంటే సినిమా సక్సెస్ అవుతుందని ఈ సినిమా నిరూపించింది. ఈ క్రమంలోనే అదా శర్మ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. గిటార్ వాయిస్తూ, అద్భుతమైన తన గాత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అదా శర్మ. ఆషాఢ ఏకాదశి సందర్భంగా ఈ పాటను పాడి వినిపించిన అదా. అదా శర్మ గాత్రం విని.. ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. Image Credits : Adah Sharma/Instagram