కొన్ని రకాల ఆహారాలు రాత్రి పూట తినడం వల్ల ఆరోగ్యానికి చెరుపు చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాం.

మిరపకాయల్లో ఉండే కారం వల్ల గుండెల్లో మంట రావచ్చు. నిద్రకు అంతరాయం ఏర్పడవచ్చు. కనుక రాత్రి పూట తినకూడదు.

మిరపకాయలు ఉపయోగించి చేసే వంటకాలన్నింటిని కూడా రాత్రి భోజనంలో వడ్డించకూడదు.

లాక్టోజ్ ఇన్టాలరెంట్ సమస్య ఉన్న వారు రాత్రి పూట పాలు తీసుకుంటే కడుపులో ఇరిటేషన్ వల్ల నిద్రకు అంతరాయం కలుగవచ్చు.

రాత్రి పూట మాంసాహారం తీసుకోవద్దు జీర్ణం కావడానికి సమయం పట్టడం వల్ల నిద్రకు అంతరాయం ఏర్పడుతుంది.

రాత్రి పూట నట్ బటర్ తినకూడదు. రాత్రి భోజనంలో ఎప్పుడైనా బాదం, తక్కువ కొవ్వు కలిగిన పదార్థాలు తీసుకోవడం మంచిది.

బరువు తగ్గాలని అనుకునే వారు రాత్రిపూట అన్నం తినకుండా ఉండడమే మంచిది.

అన్నం అంటే ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్ వినియోగం కొవ్వు చేరడం మాత్రమే కాదు శరీరం నీటిని కూడా ఎక్కువ నిలువ చేస్తుంది.

Representational Image : Pexels