చాలామందికి ప్రయాణంలో వాంతులు అవుతుంటాయి. దాన్ని నివారించేందుకు కొన్ని చిట్కాలు

ప్రయాణంలో అల్లం టీ లేదా అల్లం గుళికలు, లేదా తురిమిన అల్లం తీసుకుంటే తలతిరగడం ఉండదు.

వాములో ఉండే థైమోల్ యాంటియేమిటిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. కనుక వాంతులు కాకుండా నిరోధిస్తుంది.

వికారం, ప్రయాణంలో అసౌకర్యాన్ని తగ్గించేందుకు వెచ్చని తులసి టీ తీసుకుంటే అమృతంలా పనిచేస్తుంది.

సోంపు గింజలు నమిలినా లేదా వేడి నీటిలో వేసి సోంపు టీ చేసుకుని తాగినా ప్రయాణం సాఫీగా సాగుతుంది.

అమలకి, బిభిటకీ, హరితకి మూడింటిని కలిపి త్రిఫల అంటారు. వీటి చూర్ణాన్ని ప్రయాణానికి ముందు తీసుకుంటే చాలు

ప్రయాణం పొడవునా ఒక ఇలాచీ బుగ్గన పెట్టుకుని కొద్దికొద్దిగా దాని రసం మింగితే మంచి ఫలితం ఉంటుంది.

పుదీనాలో ఉండే మెంథాల్ నాడీ వ్యవస్థను శాంత పరుస్తుంది. పుదీనా టీ ప్రయాణానికి ముందు తాగేస్తే సరి.

ప్రయాణానికి ముందు తాజా ఉసిరి కాయ లేదా ఉసిరి రసాన్ని తీసుకుంటే ప్రయాణంలో సిక్ నెస్ రాదు.

Representational Image : pexels and pixabay