షుగర్ అదుపులో పెట్టుకునేందుకు మందులతో పాటు కొన్ని రకాల ఇంటి చిట్కాలు చాలా మంచి పరిష్కారం చూపుతాయి.

ఆయుర్వేదం సూచిస్తున్న ఈ పానీయాలు అటువంటివే.

పరగడుపున పొద్దున్నే కాకరకాయ రసం తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఉసిరిలో యాంటి ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ. ఉదయం పరగడుపున ఉసిరి రసాన్ని తీసుకుంటే షుగర్ అదుపులో ఉంటుంది.

ఒక టీ స్పూన్ మెంతులు రాత్రంగా నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున ఆ నీటిని వడగట్టి తాగితే మంచి ఫలితం ఉంటుంది.

గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి పరగడుపున తాగితే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

యాంటీ డయాబెటిక్, యాంటీ బయోటిక్ లక్షణాలు కలిగిన వేప రసం ఉదయాన్నే తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

కలబందతో కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. కానీ దీనితో కొంత జాగ్రత్తగా ఉండాలి. కొద్ది మొత్తంలో తీసుకోవడంతో ప్రారంభిస్తే మంచిది.

Representational Image : pexels