తోటకూర పోషకాలను అధిక మొత్తంలో కలిగి ఉంటుంది.

అందుకే దీనిని చాలామంది జ్యూస్​లు, స్మూతీల రూపంలో తీసుకుంటారు.

హెల్త్​కి మంచిది అని ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఇబ్బందులు తప్పవట.

ఎందుకంటే దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు వస్తాయట.

ఈ ఆకుకూరలోని ఆక్సలేట్ సమ్మేళనమే రాళ్లు ఏర్పడేందుకు ప్రధాన కారణం.

ఫైబర్ అధికంగా ఉండే దీనిని తీసుకోవడం వల్ల గ్యాస్, మలబద్ధకం వచ్చే అవకాశముంది.

థైరాయిడ్ ఉన్నవారు దీనిని ఎక్కువ మోతాదులో తీసుకోకపోవడమే మంచిది.

ఎందుకంటే ఇది థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది.

కొందరికీ దురద, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందువు వంటివి వస్తాయి.

మితంగా తీసుకుంటే మాత్రం ఇది అత్యంత పోషకమైన ఆహారమవుతుంది. (Image Source : Pexels)