దక్షిణ భారత సంప్రదాయ వంటకాలతో బరువు పెరిగిపోతారనే వాదన ఉంది.

బరువు తగ్గించే కొన్ని దక్షిణ భారత సంప్రదాయ వంటకాల గురించి తెలుసుకుందాం.

ఇడ్లి పులియబెట్టిన బియ్యం, మినపపప్పు పిండితో తయారు చేసేది.

ఇందులో క్యాలరీలు తక్కువ. త్వరగా జీర్ణం అవుతుంది. పోషకాలు కలిగి ఉంటుంది.

దోశ కూడా ఇడ్లీ లాంటిదే. గోధుమ పిండితో చేసే రొట్టెకు ప్రత్యామ్నాయంగా భావించవచ్చు.

ఉప్మా లో క్యాలరీలు తక్కువ. కడుపునిండుగా ఉండే చక్కటి బ్రేక్ ఫాస్ట్.

స్పైసీ అండ్ ట్యాంగీ సౌత్ ఇండియన్ సూప్ రసం. ఇది మంచి జీర్ణకారీ. అన్నంతో కలిపి తీసుకున్నపుడు తేలికగా జీర్ణం అవుతుంది.

రకరకాల కూరగాయలు, చింతపండు, పప్పుతో కలిపి చేసే సాంబర్ రుచి కరమైన సైడ్ డిష్. తక్కువ కేలరీలతో అన్నానికి మంచి సహచరి.

సంప్రదాయ కేరళ సాధ్య సాంబార్, రసం, కొబ్బరితో చేసిన కూరలు, అన్నం తో కంప్లీట్ మీల్.

Representational Image : Pixels and Pixabay