దానిమ్మ ఆక్సిజన్ మాస్కులతో సమానం



దానిమ్మ పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.



దానిమ్మ గింజలు తినడం వల్ల రక్త కణాలకు ఆక్సిజన్ చక్కగా అందుతుంది. అందుకే వీటిని ఆక్సిజన్ మాస్కులు అంటారు.



దానిమ్మలు తినడం వల్ల వయసు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి.



దానిమ్మలు తినడం వల్ల పొటాషియం, విటమిన్ సి, విటమిన్ కె వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.



ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న వారు దానిమ్మలను తింటూ ఉండాలి. ఒత్తిడి హార్మోను విడుదలవ్వకుండా అడ్డుకుంటుంది.



ఎముకలు గట్టిగా మారేందుకు దానిమ్మ గింజలు చాలా అవసరం.



దానిమ్మ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటి వల్ల ఎన్నో వ్యాధులు రాకుండా ఉంటాయి.



గుండె సమస్యలు రాకుండా ఉండాలన్నా కూడా దానిమ్మ గింజలు ఎంతో ఉపయోగపడతాయి.