కాకర కచ్చితంగా తినాల్సిందేనా?



కాకరకాయ చాలా మందికి ఇష్టం లేని కూరగాయ. నిజానికి దీన్ని కచ్చితంగా తినాల్సిందేనని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.



కాకరకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.



కాకరను తరచూ తినడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి.



ఈ కూరగాయల వల్ల ఫైబర్, జింక్, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు దొరుకుతాయి.



మధుమేహం ఉన్నవారికి కాకర మంచి ఆహారం. వీరు కచ్చితంగా తినాలి.



రక్తాన్ని శుద్ధి చేయడానికి కారకలోని పోషకాలు చాలా అవసరం.



శ్వాసకోశ వ్యాధులు రాకుండా కాకర అడ్డుకుంటుంది.



అయితే గర్భిణులు మాత్రం కాకరకాయతో చేసిన వంటలు తక్కువగా తినాలని చెబుతున్నారు వైద్యులు.