టీనేజర్స్, కొత్తగా ఈ కప్ ట్రై చేయాలనుకునేవారు చిన్న కప్స్​ని ఎంచుకోండి.

25 నుంచి 35 ఏళ్ల స్త్రీలు మీడియం సైజ్ కప్స్​ ఎంచుకోవచ్చు.

35 ఏళ్లు మించిన వారు పెద్ద సైజు లేదా ఫ్లోకి తగ్గట్లు కప్స్ ఉపయోగించవచ్చు.

కప్పును సులభంగా రెండు పద్ధతుల్లో యోనిలోకి చొప్పించవచ్చు.

ఒకటి సి-ఫోల్డ్ పద్ధతి.. రెండోది పుష్ డౌన్​ పద్ధతి.

మొదటి పద్ధతిలో కప్​ను సగానికి మడిచి వేళ్లతో గట్టిగా పట్టుకుని లోపలికి పంపొచ్చు.

రెండో​ పద్ధతిలో కప్​ అంచుపై చూపుడు వేలు ఉంచి బేస్​లోకి నెట్టి యోనిలోకి పంపొచ్చు.

కప్​ను లోపలికి పంపే, బయటకు తీసే సమయంలో మీ చేతులు శుభ్రంగా కడుక్కోండి. (Picture Credit : Pexels)