ఏడాదిలో పదిహేను రోజుల పాటు తప్పని సరిగా పితృపక్షాలు నిర్వహిస్తారు.

భాద్రపద శుక్లపక్ష పౌర్ణమి రోజు ప్రారంభమై సర్వపితృ అమావాస్య రోజుతో ముగుస్తుంది.

ఈ కాలంలో వంశంలోని పెద్దల కోసం శ్రాద్ధ కర్మలు, పిండప్రధానం చేస్తుంటారు.

ఆత్మీయుల మరణం తర్వాత కొంత మంది వారి జ్ఞాపకార్థం వారి వస్తువులను దాచుకుంటారు.

దాని వల్ల సమస్యలు వస్తాయని పండితులు హెచ్చరిస్తున్నారు.

మరణించిన వారి వస్తువులను ఉపయోగిస్తే పితృదోషం కలుగవచ్చని జ్యోతిషం చెబుతోంది.

మరణించిన వారి దుస్తులు ధరించ కూడదు. వాటిని దానం చెయ్యడం మంచిది .

మరణించిన వారి ఆభరణాలను ధరించడం కంటే ఆ బంగారాన్ని ఉపయోగించి కొత్త నగలు చేయించి వాడుకోవడం మంచిది.

మరణించిన వారి వాచీలు ఉపయోగించకూడదు. ఎవరికైనా దానం చెయ్యవచ్చు, భూస్థాపితం చెయ్యాలి.

Representational Image : Pexels