'కార్తికేయ 2'తో నిఖిల్ పాన్ ఇండియా హిట్ కొట్టారు. దాని తర్వాత 'స్పై'తో మళ్ళీ పాన్ ఇండియా రిలీజ్‌కు వెళ్ళారు. సినిమా ఎలా ఉంది? కథ : జై (నిఖిల్) రా ఏజెంట్. అతని అన్నయ్య సుభాష్ (ఆర్యన్ రాజేష్) కూడా 'రా' ఏజెంట్. అనుమానాస్పదంగా సుభాష్ మృతి చెందుతాడు. అన్నయ్యను ఎవరు చంపారో తెలుసుకోవాలని జై ట్రై చేస్తుంటాడు. అయితే... సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ ఫైల్స్ తీసుకు రమ్మని చెబుతారు. జై ఆ ఫైల్స్ తెచ్చారా? జై అన్నయ్య చంపిన ఖాదిర్ ఖాన్ మళ్ళీ ఎలా బతికాడు? ఆ మిస్టరీని ఎలా చేధించాడు? అనేది కథ. ఎలా ఉంది? : 'స్పై' సినిమాలో స్పై థ్రిల్లర్ లక్షణం ఒక్కటి లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నత్తనడకన సాగింది. రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ కథతో 'స్పై' తీశారు. కొన్ని సీన్స్ అయితే కామెడీగా ఉన్నాయి. లాజిక్స్ అసలు లేవు. విజువల్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్, ప్రొడక్షన్ వేల్యూస్ ఘోరం. మ్యూజిక్ జస్ట్ ఓకే. హీరో హీరోయిన్ ట్రాక్ బాలేదు. నిఖిల్ తన పాత్రకు న్యాయం చేశారు. పేలవమైన కథ, కథనాల ముందు ఆయన నటన తేలిపోయింది. సినిమా డిజప్పాయింట్ చేస్తుంది. సుభాష్ చంద్రబోస్‌ను పబ్లిసిటీకి వాడుకున్న ఫీలింగ్ కలుగుతుంది.