రోజూ మొలకెత్తిన గింజలు తింటే గుండెకు ఎంతో మేలు!

మొలకెత్తిన గింజల్లో విటమిన్స్‌, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

వీటిలో ఫైబర్‌, ప్రొటీన్‌, ఎంజైమ్‌లు అధికంగా ఉంటాయి.

మొలకల్లో విటమిన్‌ సి, ఫోలేట్‌, ఐరన్‌, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.

మొలకల్లో కేలరీలు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.

మొలకెత్తిన గింజల్లోని ఫైబర్‌ జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది.

మహిళల్లో నెలసరి సమస్యలు, సంతానలేమి సమస్యలకు చెక్ పెడుతాయి.

మొలకల్లోని విటమిన్ C ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి.

మొలకల్లోని పొటాషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు మేలు చేస్తాయి.

మొలకల్లోని మెగ్నీషియం, క్యాల్షియం మెదడు పనితీరును పెంచుతాయి. All Photos Credit: Pixabay.com