భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. కానీ ఈలోపు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. అనంతరం భారత్ 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌట్ అయింది. శుభ్‌మన్ గిల్ (31), వాషింగ్టన్ సుందర్ (27) మినహా మరెవరూ 20 పరుగులు చేయలేదు. జింబాబ్వే బౌలర్లలో కెప్టెన్ సికందర్ రజా, చటారా మూడేసి వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. సికందర్ రజాకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.