టీ20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుని ప్రధాని మోదీ కలిశారు.

ఈ సమావేశంలో యుజ్వేంద్ర చాహల్ గురించి మోదీ అడిగిన ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి.

‘చాహల్ ఎందుకు సీరియస్‌గా ఉన్నాడు.’ అని రోహిత్‌ని మోదీ అడిగారు.

అనంతరం ‘నేను సరిగ్గానే గెస్ చేశాను కదా’ అని కూడా అడిగారు.

‘హర్యానాకు చెందిన వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సంతోషంగానే ఉంటారు.’ అన్నారు.

‘చిన్న చిన్న విషయాలు కూడా వారికి ఆనందాన్ని కలిగిస్తాయి.’ అని మోదీ అన్నారు.

నిజానికి ఈ టోర్నమెంట్‌లో చాహల్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.

టోర్నమెంట్ మొత్తమ్మీద భారత్ ఒక్కసారి కూడా తుది జట్టులో మార్పులు చేయలేదు.

అనంతరం ట్రోఫీ సెలబ్రేషన్ మూమెంట్స్ గురించి మోదీ జట్టును అడిగారు.

జట్టు సభ్యులు అడిగితేనే తాను అలా చేశానని రోహిత్ తెలిపాడు.