టీ20 వరల్డ్ కప్ 2024పై వర్షం చాలా ఎఫెక్ట్ చూపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. గ్రూప్-ఏలో యూఎస్ఏ, ఐర్లాండ్‌ల మధ్య జరగాల్సిన వర్షం కారణంగా రద్దయింది. ఒకవేళ ఆ మ్యాచ్ జరిగి యూఎస్ఏ ఓడి ఉంటే పాకిస్తాన్ సూపర్-8కు చేరి ఉండేది. వర్షం కారణంగా పాకిస్తాన్ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయింది. గ్రూప్-బిలో ఇంగ్లండ్, స్కాట్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన వర్షం కారణంగా రద్దయింది. దీని కారణంగా ఇంగ్లండ్ సూపర్-8కు చేరడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ మ్యాచ్ రిజల్ట్‌పై ఆధారపడాల్సి వచ్చింది. గ్రూప్-డిలో శ్రీలంక... నేపాల్‌తో ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కానీ అప్పటికే శ్రీలంక టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది.