ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచింది. కానీ శివందూబేపై దారుణమైన ట్రోలింగ్ నడుస్తుంది. ఐర్లాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో దూబే బ్యాటింగ్ చేశాడు. కానీ ఒక్క పరుగు కూడా చేయకుండా నాటౌట్‌గా నిలిచాడు. కానీ కీలకమైన పాక్ మ్యాచ్‌లో ఘోరంగా విఫలం అయ్యాడు. తొమ్మిది బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. రోహిత్ శర్మ... దూబేకు బౌలింగ్ కూడా ఇవ్వలేదు. ఫీల్డింగ్‌లో కూడా మహ్మద్ రిజ్వాన్ క్యాచ్ వదిలేశాడు. కానీ అదృష్టవశాత్తూ రిజ్వాన్ ఎఫెక్ట్ చూపించలేకపోయాడు. రింకూని పక్కన పెట్టి దూబేని తీసుకోవడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.