భారత మహిళా క్రికెటర్ స్మృతి మంథన దక్షిణాఫ్రికాపై అద్భుత సెంచరీ సాధించారు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 265/8 స్కోరు సాధించింది. స్మృతి మంథన ఈ మ్యాచ్‌లో 127 బంతుల్లో 117 పరుగులు చేశారు. ఇందులో 12 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. స్మృతి మంథనకు ఇది వన్డేల్లో ఆరో సెంచరీ. వన్డేల్లో మనదేశంలో తనకు ఇదే మొదటి శతకం కావడం విశేషం. అంటే ఇప్పటివరకు తనకు చేసిన సెంచరీలన్నీ బయటదేశాల్లో చేసినవే. భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచింది. ఈ జాబితాలో మిథాలీ రాజ్ ఏడు సెంచరీలతో టాప్‌లో ఉంది. అనంతరం దక్షిణాఫ్రికా కేవలం 122 పరుగులకే ఆలౌట్ అయింది.