భారత జట్టు రోహిత్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ 2024 గెలుచుకుంది. టీ20 ఫార్మాట్ ఫైనల్స్‌లో రోహిత్‌కు కెప్టెన్‌గా 100 శాతం ట్రాక్ రికార్డు ఉంది. 20 ఓవర్ల ఫార్మాట్లో ఆటగాడిగా రోహిత్ శర్మ ఇప్పటివరకు 11 ఫైనల్స్ గెలిచాడు. అయితే ఈ లిస్టులో డ్వేన్ బ్రేవో టాప్ ప్లేసులో ఉన్నాడు. డ్వేన్ బ్రేవో ఇప్పటివరకు టీ20 ఫార్మాట్లో 17 ఫైనల్స్ గెలిచాడు. రెండో స్థానంలో వెస్టిండీస్‌కే చెందిన కీరన్ పొలార్డ్ 17 విజయాలతో ఉన్నాడు. షోయబ్ మాలిక్ ఈ విషయంలో పొలార్డ్‌తో సమానంగా ఉన్నాడు. సునీల్ నరైన్ గత సంవత్సరంగా ఐపీఎల్‌లో అద్బుతంగా ఆడుతున్నాడు. రోహిత్ లాగే నరైన్ కూడా ఇప్పటివరకు 11 ఫైనల్స్ గెలిచాడు. వెస్టిండీస్‌కే చెందిన ఆండ్రీ రసెల్ టీ20 ఫైనల్స్‌లో 10 విజయాలు సాధించాడు.