ఏ సంవత్సరంలో విరాట్ ఎక్కువసార్లు డకౌట్ అయ్యాడు - 2024లో ఎన్ని? న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. 2024లో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ నాలుగు సార్లు డకౌట్ అయ్యాడు. 2017లో అత్యధికంగా ఐదు సార్లు విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. 2021లో కూడా విరాట్ కోహ్లీ ఐదు సార్లు సున్నాకే పరిమితం అయ్యాడు. 2011లో విరాట్ కోహ్లీ నాలుగు సార్లు డకౌట్ అయ్యాడు. ఈ సంవత్సరం విరాట్ కోహ్లీ ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. విరాట్ కోహ్లీ డకౌట్ల రికార్డును బ్రేక్ చేయకూడదనే మనం కోరుకుందాం. విరాట్ కోహ్లీ ప్రస్తుతం మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. కానీ గతంలో కొట్టిన రేంజ్‌లో సెంచరీలు మాత్రం కొట్టలేకపోతున్నాడు.