చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను రిటైన్ చేసుకోనుంది. రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు రవీంద్ర జడేజా కూడా రిటెన్షన్ లిస్ట్‌లో ఉండే ఛాన్స్ ఉంది. రుతురాజ్ గైక్వాడ్, జడేజాలకు సమానంగా రెమ్యునరేషన్ దక్కనున్నట్లు సమాచారం. రుతురాజ్ గైక్వాడ్‌కు రూ.18 కోట్లు లభించే అవకాశం ఉంది. వీరిద్దరితో పాటు శివం దూబేను కూడా చెన్నై రిటైన్ చేసేందుకు ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్‌లో స్టార్ ఆల్ రౌండర్. కాబట్టి రవీంద్ర జడేజాకు కూడా రూ.18 కోట్లు దక్కే ఛాన్స్ ఉంది. వీరితో పాటు శ్రీలంక స్టార్ పేసర్ మతీష పతిరాణాను కూడా చెన్నై రిటైన్ చేసే అవకాశం ఉంది. రిటెన్షన్లకు సంబంధించిన అఫీషియల్ లిస్ట్‌ను చెన్నై త్వరలో విడుదల చేయనుంది. ఐపీఎల్ మెగా ఆక్షన్‌కు ముందు ఈ లిస్ట్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది.