ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీకి ఫైన్ పడింది. కేకేఆర్, ఆర్సీబీ మధ్య బెంగళూరులో మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఒక్క పరుగుతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనే విరాట్ కోహ్లీ నోబాల్ వివాదం కూడా చోటు చేసుకుంది. ఇందులో బీసీసీఐ విరాట్‌నే దోషిగా గుర్తించింది. దీని కారణంగా విరాట్‌కు 50 శాతం మ్యాచ్ ఫీజులో కోత పడింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ముందు కేకేఆర్ 222 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. విరాట్ కోహ్లీ ఏడు బంతుల్లో 18 పరుగులు చేసి అవుటయ్యాడు. హర్షిత్ వేసిన ఫుల్ టాస్‌ను విరాట్ ముందుకు వచ్చి ఆడాడు. అయితే థర్డ్ అంపైర్ దీన్ని నోబాల్‌గా ప్రకటించారు.