కింగ్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో ఒకసారి 99 పరుగుల మీద అవుటయ్యాడు. 2013 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ 99కు అవుటయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ పృథ్వీ షా కూడా 99 పరుగులకు అవుటయ్యాడు. 2018 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా 99కు అవుటయ్యాడు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఒకసారి 99 పరుగుల మీద పెవిలియన్ బాట పట్టాడు. 2022లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ ఇలా అవుటయ్యాడు. ఇషాన్ కిషన్ కూడా 99 పరుగుల మీద అవుటైన లిస్ట్‌లో ఉన్నాడు. 2020లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 99 పరుగులు చేసి అవుటయ్యాడు. డాషింగ్ బ్యాటర్ క్రిస్ గేల్ కూడా 99 పరుగులు చేసిన అవుట్ అయిన సందర్భం ఉంది. 2020లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ 99కు అవుటయ్యాడు.