ఐపీఎల్ 2024 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు మరో విజయం దక్కింది. ఆదివారం రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌట్ అయింది. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం గుజరాత్ 19.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చివర్లో రాహుల్ తెవాటియా (36: 18 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో గుజరాత్ ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. సాయి కిశోర్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరింది. పంజాబ్ కింగ్స్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది.