అంతర్జాతీయ క్రికెట్లో ఎన్ని రకాల బాల్స్ వాడతారు? అంతర్జాతీయ క్రికెట్లో మూడు రకాల బాల్స్ వాడతారు. అవే రెడ్, వైట్, పింక్. రెడ్ బాల్ అనేది క్రికెట్ చరిత్రలోనే పాత బంతి. దీన్ని టెస్టు మ్యాచ్‌ల్లో వాడతారు. డ్యూక్స్ కంపెనీ రెడ్ బాల్‌ను ఇంగ్లండ్, వెస్టిండీస్‌ల్లో ఉపయోగిస్తారు. కూకాబుర్రా బాల్‌ను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లో వాడతారు. ఎస్‌జీ బాల్‌ను భారత్‌లో టెస్టు మ్యాచ్‌ల్లో ఉపయోగిస్తారు. వన్డేలు, టీ20 మ్యాచ్‌ల్లో వైట్ బాల్‌ను వాడతారు. ప్రారంభ ఓవర్లలో వైట్ బాల్ బాగా స్వింగ్ అవుతుంది. 2012 నుంచి వైట్ బాల్ క్రికెట్లో రెండు ఎండ్‌ల్లో రెండు కొత్త బంతులు ఉపయోగిస్తున్నారు. డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌ల్లో పింక్ బాల్ ఉపయోగిస్తారు. భారత్‌లో మొదటిసారి పింక్ బాల్‌ను 2019లో వాడారు.