ఐపీఎల్ 2025 కోసం మెగా వేలం కొన్ని నెలల్లో జరగనుంది. చాలా మంది ఆటగాళ్లు ఒక ఫ్రాంచైజీ నుంచి మరో ఫ్రాంచైజీకి మారనున్నారు. వీరిలో అతి పెద్ద పేరు రోహత్ శర్మ అని తెలుస్తోంది. కెప్టెన్సీ వదిలేసిన దగ్గర నుంచి రోహిత్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా వేరే ఫ్రాంచైజీకి వెళ్తాడని సమాచారం. సూర్య, రోహిత్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా వేరే ఫ్రాంచైజీకి వెళ్లనున్నాడట. రిషబ్ పంత్‌ను ఢిల్లీ వదిలితే చెన్నై కొనుక్కుంటుందని తెలుస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా వేరే ఫ్రాంచైజీకి వెళ్తాడని సమాచారం. కేఎల్ రాహుల్‌ను ఆర్సీబీ కొనుగోలు చేయనుందని తెలుస్తోంది.