భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. ఒకే టీ20 సిరీస్‌లో హాఫ్ సెంచరీ, రెండు వికెట్ల హాల్ సాధించిన మొదటి ఇండియన్ ప్లేయర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఎవరూ ఈ రికార్డు కొట్టలేకపోయారు. సూర్య కెప్టెన్సీలో భారత్ 3-0తో శ్రీలంకను వైట్‌వాష్ చేసింది. ఈ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా సూర్యకుమార్ యాదవ్‌కే దక్కింది. ఇది సూర్యకు ఐదో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు. ఇండియన్ ప్లేయర్స్‌లో విరాట్ కోహ్లీ (6) మాత్రమే సూర్య ముందున్నాడు. మూడో టీ20లో భారత్ విజయం సాధించడంలో సూర్యకుమార్ కీలకపాత్ర పోషించాడు. అత్యంత కీలకమైన చివరి ఓవర్లో ఆరు పరుగులను డిఫెండ్ చేశాడు. దీంతో పాటు రెండు వికెట్లు కూడా తీసుకున్నాడు.