ఐపీఎల్ 2025లో కొందరు స్టార్ ఆటగాళ్లు ఫ్రాంచైజీలు మారనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ కోసం మెగా ఆక్షన్ 2024 చివర్లో లేదా 2025 మొదట్లో జరగనుంది. కొన్ని ఫ్రాంచైజీలు రానున్న ఐపీఎల్ సీజన్లో కెప్టెన్సీ ఆప్షన్ల కోసం చూస్తున్నాయి. ఈ స్టార్ ప్లేయర్లు మెగా వేలంలోకి వచ్చే అవకాశం ఉంది. వారెవరో చూద్దాం. రోహిత్ శర్మ - ఐపీఎల్ 2025 సీజన్‌లో రోహిత్ ముంబైకి ఆడకపోవచ్చని తెలుస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్‌కు రోహిత్ స్థానంలో హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించారు. సూర్యకుమార్ యాదవ్ - ముంబైని సూర్య కూడా వదిలేయనున్నాడని సమాచారం. మెగా వేలంలో అందుబాటులోకి వస్తే సూర్యని కొనాలని కేకేఆర్ ఆసక్తిగా ఉందట. రిషబ్ పంత్ - ఢిల్లీ క్యాపిటల్స్... పంత్ ప్రదర్శనతో హ్యాపీగా లేదని సమాచారం. రిషబ్ పంత్ వేలంలోకి వస్తే సీఎస్కే అతనిపై కన్నేసినట్లు తెలుస్తోంది. కేఎల్ రాహుల్ - లక్నో జట్టు కేఎల్ రాహుల్‌ను వదిలేయనుందని సమాచారం. యజమాని సంజీవ్ గోయెంకాతో రాహుల్‌కు పడట్లేదనేది ఓపెన్ సీక్రెట్.