టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ ఆటకు గుడ్‌బై చెప్పాడు. టెన్నిస్‌కు రిటైర్మెంట్ తెలుపుతున్నట్లు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిపాడు. నాదల్ తన కెరీర్‌లో ఎన్నో రికార్డు బ్రేక్ చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. రఫెల్ నాదల్ తన కెరీర్‌లో ఏకంగా 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు సాధించాడు. ప్రస్తుత ఆటగాళ్ల కెరీర్‌ను పరీశిలిస్తే రికార్డును ఎవరు బద్దలు కొట్టాలన్నా అసాధ్యమే. పురుషుల గ్రాండ్‌స్లామ్ చరిత్రలో రఫెల్ నాదల్ 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను సాధించాడు. ఈ లిస్టులో నోవాక్ జకోవిచ్ (24) టాప్‌లో ఉండగా సెకండ్ ప్లేస్ నాదల్‌దే. కెరీర్ గోల్డెన్ స్లామ్ (నాలుగు గ్రాండ్‌స్లామ్‌లతో పాటు ఒలంపిక్ గోల్డ్) కొట్టిన రెండో ప్లేయర్ నాదలే. నాదల్ తన కెరీర్ మొత్తం మీద రెండు ఒలంపిక్ బంగారు పతకాలు సాధించాడు. నాదల్ తన కెరీర్‌లో ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్స్‌ను ఏకంగా 36 సార్లు సాధించాడు.