టెస్టుల్లో పాకిస్తాన్ అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా (823/7) ఇంగ్లండ్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ 317 పరుగులు సాధించాడు. టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున ఇది ఐదో అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇంగ్లండ్ తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆరో బ్యాటర్‌గా హ్యారీ బ్రూక్ నిలిచాడు. హ్యారీ బ్రూక్‌తో పాటు జో రూట్ కూడా 262 పరుగులు సాధించాడు. ఇది తనకు కెరీర్ బెస్ట్ కూడా. టెస్టుల్లో పాకిస్తాన్‌లో ఇదే అత్యధిక స్కోరు. పాకిస్తాన్ కూడా ఎప్పుడూ ఇంత స్కోరు కొట్టలేదు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే జో రూట్, హ్యారీ బ్రూక్ నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం (454) నమోదు చేశారు. 1877లో టెస్టు క్రికెట్ ప్రారంభమైన తర్వాత నాలుగో వికెట్‌కు 450 పరుగుల భాగస్వామ్యం దాటడం ఇదే తొలిసారి. ఒకే టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఇద్దరు బ్యాటర్లు 250కి పైగా స్కోరు సాధించడం చరిత్రలో ఇది మూడో సారి మాత్రమే. ఇంగ్లండ్ తరఫున రెండు సార్లు 300కి పైగా భాగస్వామ్యం నమోదు చేసిన ఏకైక జోడీ జో రూట్, హ్యారీ బ్రూక్. వీరేంద్ర సెహ్వాగ్ (278 బంతుల్లో) తర్వాత హ్యారీ బ్రూక్ టెస్టుల్లో రెండో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ (310) కొట్టాడు.