షమీ కొంప ముంచిన గాయం - ఆస్ట్రేలియా టూర్ ఆశలపై నీళ్లు! మహ్మద్ షమీ భారత జట్టులో కీలకమైన ఫాస్ట్ బౌలర్. కానీ ఆస్ట్రేలియా టూర్‌కు మాత్రం షమీ ఎంపిక కాలేదు. రంజీ ట్రోఫీ ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే భారత జట్టులోకి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మహ్మద్ షమీకి మళ్లీ గాయం అయింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం మహ్మద్ షమీ మడమ గాయంతో బాధపడుతున్నాడు. దీంతో బెంగాల్ సెలెక్టర్లు రంజీ ట్రోఫీకి షమీని సెలక్ట్ చేయలేదు. ఈ కారణంగా రంజీ ట్రోఫీ ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకునే అవకాశం షమీకి రాలేదు. ఈ కారణంగా మహ్మద్ షమీ ఆస్ట్రేలియా టూర్‌కి సెలక్ట్ అయ్యే అవకాశం లేదు. మరి షమీకి టీమిండియా డోర్లు మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటాయో చూడాలి మరి!