చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్‌ను నియమించినట్లు తెలుస్తోంది. దీంతో కత్రినా కైఫ్‌కు అదనపు బాధ్యతలు లభించినట్లు అయింది. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సల్మాన్, షారుక్ లాంటి టాప్ స్టార్ల సరసన నటించింది. తెలుగులో కూడా కత్రినా కొన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు చెన్నైకి బ్రాండ్ అంబాసిడర్ కావడం ద్వారా కత్రినాకు కొత్త అవకాశం దక్కినట్లు అయింది. ఐపీఎల్‌లో బెస్ట్ టీమ్స్‌లో చెన్నై ఒకటి. ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్ కూడా. ధోని కెప్టెన్సీలో చెన్నై ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ప్రస్తుతం చెన్నై ఐపీఎల్ 2024కు ప్రిపేర్ అవుతుంది.