స్పితి వ్యాలీ అందాలు చూడాల్సిందే హిమాచల్ ప్రదేశ్లోని ఈశాన్య భాగంలో ఉన్న ఓ మారుమూల లోయ స్పితి. స్పితి అంటే ‘మధ్యలో ఉన్న భూమి’ అని అర్థం. ఈ లోయ టిబెట్‌కు, భారతదేశానికి మధ్యలో ఉంటుంది. అందుకే ఆ పేరు వచ్చింది. ప్రపంచంలో అతి ఎత్తయిన ప్రదేశంలో ఉన్న గ్రామం స్పితి లోయలోనే ఉంది. పర్వత బైకింగ్, జడల బర్రెలపై సఫారీ వంటివి కూడా ఇక్కడ అదనపు ఆకర్షణ. ఇక్కడున్న గియు గ్రామంలో 500 ఏళ్ల నాటి మమ్మీ ఉంది. టాబో తెగ ప్రజలు నివసించిన గుహలు ఇంకా అక్కడ కనిపిస్తాయి. టాబోలు వందల ఏళ్ల క్రితం ఆ ప్రాంతాన్ని పాలించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. స్పితి లోయ బౌద్ధ లామాలతో నిండి ఉంటుంది. టాబో తెగ ప్రజలు నివసించిన గుహలు ఇంకా అక్కడ కనిపిస్తాయి. టాబోలు వందల ఏళ్ల క్రితం ఆ ప్రాంతాన్ని పాలించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు.