మేషం ఈ రోజు మీరు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.కార్యాలయంలో మీకు వ్యతిరేకంగా కొన్ని జరుగుతాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. వ్యాపారంలో మందగమనం దూరమవుతుంది. జాగ్రత్తగా ఖర్చు పెట్టండి.
వృషభం ఈ రోజు మీకు బంధువుతో వివాదం జరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాల గురించి ఆందోళన చెందుతారు. రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తులకు బాధ్యత పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది.పాత వ్యాధులు నయమవుతాయి.ఇంటి పెద్దల మాటలు పరిగణలోకి తీసుకోండి.
మిథునం మీరు ఈ రోజు సానుకూలంగా ఉంటారు.ప్రేమికుల విషయంలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగొచ్చు. మీరు కార్యాలయంలో మంచి సమాచారం పొందుతారు. వృత్తికి సంబంధించిన పనులను పూర్తి చేయగలుగుతారు.ఈ రోజు మీరు కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్యపై చర్చించవచ్చు. ఆర్థికంగా బలపడతారు.
కర్కాటకం తెలియని భయం వల్ల మీ పని దెబ్బతింటుంది.రహస్యాల అధ్యయనం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త ఇల్లు కొనేందుకు ప్రణాళిక వేసుకునేందుకు ఇదే మంచి సమయం.ఉద్యోగుల జీతంలో పెరుగుదల ఉంటుంది. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహాయం అందుతుంది.
సింహం అనుకున్న ఓ పని పూర్తిచేయలేకపోవడం వల్ల విమర్శలకు గురవుతారు. ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. కార్యాలయంలో వివాదాస్పద పరిస్థితి ఎదురవొచ్చు. తెలియని వ్యక్తులవల్ల బాధపడతారు.ఆస్తుల భద్రతకు తగిన ఏర్పాట్లు చేసుకోండి. మొండి వైఖరిని విడిచిపెట్టండి.
కన్యా ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. అధిక శ్రమ వల్ల అలసట వస్తుంది. ఆరోగ్యం క్షీణించవచ్చు.స్నేహితుని సహాయంతో మీ పనులు పురోగమిస్తాయి.
తులా ఈ రోజు మీకు మంచి రోజు. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు.మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ వల్ల కొందరి పనులు పూర్తవుతాయి. డబ్బుకు సంబంధించిన ఆందోళనలు దూరమవుతాయి. దంపతులు సంతోషంగా ఉంటారు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.
వృశ్చికం చాలా కాలం తర్వాత పాత స్నేహితులను కలుస్తారు.ఖర్చులు అధికంగా ఉంటాయి. బంధువులతో చర్చలు జరుపుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు చదువు విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు.యువత పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
ధనుస్సు అదృష్టం కలిసొస్తుంది. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించండి. ఆస్తి విషయంలో వివాదాలు ఉండొచ్చు. ఆఫీసులో సహోద్యోగులతో సఖ్యత ఉంటుంది. అనవసర చర్చల్లో సమయాన్ని వృథా చేయకండి. ఆఫీసులో మరింత బాధ్యత ఉంటుంది.
మకరం ఈ రోజు మీకు ఏ పని చేయాలని అనిపించదు. బంధువుతో విభేదాలు రావొచ్చు. ప్రత్యర్థుల చేష్టల వల్ల కలవరపడతారు. స్వీయ అధ్యయనం చేయడంపై శ్రద్ధ ఉంటుంది. కార్యాలయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు.సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆచితూచి ఖర్చు చేయండి.
కుంభం కొత్త ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేసుకుంటారు. ఈ రోజంతా సరదాగా ఉంటారు. బంధువులను కలుస్తారు. ప్రభుత్వ పనులను పూర్తి చేయగలుగుతారు.సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. దంపతులు సంతోషంగా ఉంటారు.
మీనం వ్యాపార పరిస్థితుల్లో మార్పు ఉంటుంది. స్నేహితుల సలహాలతో మీ సమస్య పరిష్కారమవుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు. చికిత్స కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయవచ్చు. ఇచ్చిన అప్పు మొత్తం తిరిగి చేతికందుతుంది.