ఏప్రిల్ 20 బుధవారం రాశిఫలాలు



మేషం
ఈ రోజు సాధారణ రోజు అవుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు విషయాల గురించి ఆందోళన చెందుతారు. ఇంట్లో అశాంతి వాతావరణం నెలకొంటుంది. ఎవరి నుంచి ఎక్కువ ఆశించవద్దు. విలువైన వస్తువులను జాగ్రత్త .



వృషభం
ఈ రాశి వారికి ఈ రోజు చాలామంచిది. వివాదాలకు దూరంగా ఉండండి. కష్టపడి పనిచేసినా ఫలితం రాకపోవడంతో కొందరు ఆందోళన చెందుతారు.ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కార్యాలయంలో శుభవార్త వింటారు.



మిథునం
మీరు ఎక్కువ పని చేయడం వల్ల అలసిపోయినట్లు అనిపిస్తుంది.ఎండాకాలం కావడంతో ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీ పనిని ఉత్తమ మార్గంలో చేయడానికి ప్రయత్నించండి. కుటుంబంలో కమ్యూనికేషన్ లోపం ఉండవచ్చు.



కర్కాటకం
కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోండి.ఎవరితోనైనా వివాదం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.



సింహం
ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. మీరు శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రవర్తనలో చిరాకు ఉంటుంది.బంధువుతో విభేదాలు రావచ్చు. మీ వ్యక్తిగత సమస్యలను బహిరంగ ప్రదేశాల్లో చర్చించవద్దు. మిమ్మల్ని వినియోగించుకునేందుకు ప్రయత్నాలు సాగుతాయి.



కన్యా
వ్యాపారులకు ఈరోజు చాలా మంచి రోజు.వ్యాపారంలో ఆకస్మిక హెచ్చు తగ్గులు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి. మీ పని తీరు మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.



తులా
ముఖ్యమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి.డబ్బు విషయంలో రిస్క్ తీసుకోకండి. ఉత్సాహంతో కొత్త పనులు చేస్తారు. మీ పని పట్ల అజాగ్రత్తగా ఉండకండి. కోపం కారణంగా ప్రియమైన వారిని బాధపెడతారు.



వృశ్చికం
విద్యార్థులు విజయం సాధిస్తారు.ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. కఠిన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. వ్యక్తిగత సంబంధాలలో సమతుల్యతను కాపాడుకోండి. ఉద్యోగ మార్పును పరిశీలిస్తారు.



ధనుస్సు
తప్పులకు దూరంగా ఉండండి. బంధువులతో సత్సంబంధాలు కొనసాగించండి. స్నేహితుల సాయంతో సమస్యలు పరిష్కారం అవుతాయి. రోజువారీ ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలున్నాయి.



మకరం
ఈ రాశివారి టెన్షన్ తొలగిపోతుంది. కుటుంబంతో సమయం గడుపుతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి సమయం. గృహస్థులు సంతోషంగా ఉంటారు. ఈ రోజు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు.విద్యార్థులు చదువులో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు.



కుంభం
కుటుంబ పెద్దల సలహాలు తీసుకోండి. పొట్టకి సంబంధించిన సమస్యలతో బాధపడతారు.ప్రణాళికలు పూర్తి చేయడంలో అజాగ్రత్తగా ఉండకండి.పనుల్లో గత అనుభవాల వల్ల ప్రయోజనం పొందుతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.



మీనం
మీరు సత్సంగానికి హాజరవుతారు.బంధువులను కలుస్తారు. భవిష్యత్తు గురించి బాధపడతారు. కోపంతో ఎవరితోనూ మాట్లాడకండి. రాజకీయ నాయకులు లాభపడతారు. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. యాత్రను వాయిదా వేయడానికి ప్రయత్నించండి.