ఏప్రిల్ 13, 2022న బృహస్పతి ( దేవతల గురువు) రాశి మారింది. ప్రస్తుతం తన సొంత రాశి అయిన మీనంలో సంచరిస్తున్నాడు. గురుగ్రహం వల్ల ఏఏ రాశులవారికి మంచి జరుగుతుందంటే..



మేషం
ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి బృహస్పతి మేష రాశిలో 12వ ఇంట సంచరిస్తున్నాడు. అందుకే ఇది మీకు చాలా అనుకూలమైన సమయం. పూర్వీకుల ఆస్తి కలిసొస్తుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వ్యాపారులు, ఉద్యోగులకు శుభసమయం. వివాహం జరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.



కర్కాటకం
కర్కాటక రాశివారికి గురు గ్రహం తొమ్మిదో ఇంట సంచరిస్తున్నాడు. ఈ రాశి వారికి ఈ కాలం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆస్తి పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార-ఉద్యోగాల్లో లాభం ఉంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేయవద్దు.



వృశ్చికం
ఈ రాశి వారికి బృహస్పతి ఐదవ ఇంట సంచరిస్తాడు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారం విస్తరిస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. అన్నింటా పురోగతి ఉంటుంది.



కుంభం
ఈ రాశిలో గురుడు రెండవ ఇంట సంచరిస్తున్నాడు. ఈ సమయంలో వ్యాపారంలో మంచి లాభాలొస్తాయి ఉద్యోగంలో జీతాలు పెరుగుతాయి, పదోన్నతులు ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు సక్సెస్ మిమ్మల్ని మరింత ఆనందంగా ఉంచుతుంది. ఆస్తి కలిసొస్తుంది.



మీనం
మీన రాశివారికి బృహస్పతి లగ్నంలో సంచరిస్తున్నాడు.దీనివల్ల మీపై అందరికి విశ్వాసం పెరుగుతుంది, వ్యాపారంలో విజయం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది.



ఏప్రిల్ 13 నుంచి దాదాపు 13 నెలల పాటూ మీన రాశిలో సంచరిస్తాడు గురుడు. దీంతో మీ రాశిలో 2వ, 5వ, 9వ, 12వ స్థానంలో గురుడు సంచరిస్తే శుభఫలితాలు ఉంటాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.



ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.