సడెన్గా గాజు వస్తువు పగిలితే ఏం జరుగుతుంది? మన ఇంట్లో చాలా సార్లు గాజు వస్తువులు మన చేతిలో నుంచి కింద పడిపోతుంటాయి. గాజు వస్తువులు కిందపడితే కొన్ని శుభ, అశుభ సంకేతాలు ఉన్నాయని వాస్తుశాస్త్రంలో పేర్కొన్నారు. ఇంట్లో గాజు వస్తువు అకస్మాత్తుగా పగిలిపోతే ఏం జరుగుతుందో చూద్దాం. వాస్తు ప్రకారం ఇంట్లో గాజు లేదా అద్దం అకస్మాత్తుగా పలిలిపోవడం శుభ సంకేతం. భయపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో అనుకోకుండా అద్దం పగిలితే ఏదో సమస్య నుంచి బయటపడబోతున్నారని సంకేతం. అనుకోకుండా గాజు పగిలితే కుటుంబంలో ప్రతి ఒక్కరూ ప్రమాదం నుంచి బయటపడటాన్ని సూచిస్తుంది. సడెన్ గా ఇంట్లో అద్దాలు పగిలితే చాలా కాలంగా ఉన్న వివాదాలు త్వరలో ముగుస్తాయని అర్థం. పగిలిన గాజు వస్తువులు ఇంట్లో ఉంచుకుంటే అశుభం. వెంటనే ఇంట్లో నుంచి బయటపడేయాలి. వాస్తు ప్రకారం ఇంట్లో పగిలిన గాజు ఉంచితే సానుకూల శక్తిని కోల్పోతారు. ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.